- టీజీ ఎస్ఏఎన్ బి సీఐ.హేమ రాణి
భీంగల్, బతుకమ్మ : డ్రగ్స్, గంజాయి, కల్తీకల్లు ఎక్కడైన అమ్మినట్లు తెలిస్తే వెంటనే 1908 కు కాల్ చెయ్యాలని తెలంగాణ స్టేట్ యాంటి నారోటిక్ బ్యూరో సీ. ఐ హేమరాణి తెలిపారు. బుధవారం భీమ్ గల్ పట్టణంలోని సర్వ సమాజ్ భవనంలో,మండలం లోని బడాభీంగల్, మెండోర, పురానిపేట్ గ్రామాలల్లో గంజాయి, డ్రగ్స్ సేవించడం,కల్తీ కల్లు త్రాగటం వలన వచ్చే దుష్పరిణామాలు,ఆనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సులను భీమ్ గల్ పోలీసు శాఖ అద్వర్యం లో నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు కు బానిసలై యువకులు చాలా మంది జీవితాలను పాడుచేసుకొంటున్నారన్నారు. దేశ పునాధులై యువతను చెడు మార్గం నుండి మంచి మార్గంకు తీసుకురావడం మన అందరి గురుతర భాద్యత అని అన్నారు. ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములై వీటిని అరికట్టెందుకు కృషి చేయాలని, మాకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ సి.ఐ. సత్య నారాయణ, ఎస్‌ఐ మహేశ్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ దీప్ సింగ్, మండల్ మెడికల్ ఆఫీసర్ డా.అజయ్ పవార్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మహేశ్ లు పాల్గొన్నారు.
