Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:04 pm Posted by : ramakrishna

అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలి

 

. . . నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నగరంలో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి 37 మోటార్ సైకిళ్ళు, నాలుగు ఆటోలు,  ఒక టిప్పర్ ను సీజ్ చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శాంతినగర్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేరాలు జరుగడానికి ప్రధాన కారణం అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులకు సహకారం తెలుపడమేనని అన్నారు.

Information about strangers should be provided to the police

నేరం చేసిన వారితో పాటు వారికి సహకరించిన వారికి కూడా శిక్షార్హులేనన్నారు. అపరిచితులకు, గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్ళను, వాహనాలను ఇవ్వొద్దని సూచించారు. అపరిచితుల విషయంలో సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కోరారు. సైబర్ నేరాల గురించి అవగాహన ఉండాలని సూచించారు. స్థానిక ప్రాంతంలో గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం, విక్రయాల గురించి సమాచారం ఉందని, వాటికి సహకరించిన, దందాలో ఉన్న వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Information about strangers should be provided to the police