Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 6:33 pm Posted by : ramakrishna

ఎస్సార్ ఎస్పీలోకి 6,713 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 6,713 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. 30 రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5.327 టీఎంసీల వరద నీరు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1091 అడుగులు, 80.5 టిఎంసి లు కాగా బుధవారం రోజు ప్రాజెక్టులో 1065.30 అడుగులు, 16.405 టిఎంసిలు నీరు నిల్వ ఉంది.