నియోనాటల్ 108 చొరవతో క్షేమంగా చిన్నారి తరలింపు

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ బరువుతో జన్మించిన ఆడ శిశువును నియోనాటల్ 108 అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సహాయం అందించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మంతు సంతోషి తన మూడో కాన్పులో భాగంగా శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు తక్కువ బరువుతో జన్మించడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, సరిగా ఏడవకపోవడం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు కనిపించాయి. శిశువు పరిస్థితిని మెరుగుపరిచేందుకు కామారెడ్డి...