Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:57 pm Posted by : ramakrishna

మన్యం గంజాయి దందా వేనుక ఇందూర్ స్మగ్లర్లు

 

. . . పట్టు బడింది చోటామోటా స్మగ్లర్లు

 

. . . కీలక సూత్రధారులు ఇంకా పరారీలోనే

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లాలో రెండుకోట్ల విలువైన గంజాయి పట్టు బడటం కలకలం రేపింది. నిజామాబాద్ కు చెందిన గంజాయి మాఫియా ఓడిస్సా నుంచి పనస పండ్ల లోడ్ మాటున 3 క్వింటాళ్ల గంజాయిని నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా కామారెడ్డి పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది. గంజాయి ని మహారాష్ట్రకు తరలిస్తున్నారా లేక స్థానికంగా అమ్మకాలకు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు కోట్ల విలువైన సరుకును మన్యం నుంచి తరలించడం తో జిల్లా కు చెందిన పోలీస్, ఆబ్కారీ శాఖ అధికారులు విస్తుపోతున్నారు. గాంజావాలాలు ఎన్డిపిఎస్ కేసులతో, పిడి యాక్టు తో జైలు జీవితం,కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతున్నారని ఒక వైపు టి జి న్యాబ్ అధికారులు, ఈగల్ టీం దాడులతో దందా బంద్ చేశారని  అంతా అనుకున్నారు. కానీ నిజామాబాద్ కు చెందిన అంతరాష్ట్ర గాంజా గ్యాంగ్ యాక్టివ్ గా నే ఉండి గంజాయి దందాలో తలమునకలై ఉందని కామారెడ్డి పోలీసుల దాడితో తెట తెల్లమైంది. గంజాయి రవాణా అంతా మన్యం నుంచే….. తెలంగాణలో సాగు అయ్యే గంజాయి కంటే మన్యంలో పండించే గంజాయి నాణ్యమైనది గంజాయి తాగే వారు చెబుతారు. గంజాయి ప్రియుల డిమాండ్ మేరకు ఎఓబి లో పండే శీలవతి రకం కు కిలోకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆంధ్ర- ఓడిస్సా సరిహద్దులో మన్యం నుంచి గంజాయి దందా చేయడంలో ఆరితేరిపోయారు. నిజామాబాద్ జిల్లా కేకాకుండా మహారాష్ట్రకు తరలింపులో వారిది ప్రముఖ పాత్ర. గతంలో ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, కిన్వట్ , చంద్రాపూర్ నుంచి గంజాయిరవాణా చేసిన స్మగ్లర్లు ఎకంగా మన్యం నుంచి గంజాయి రవాణాకు కొత్త దారులు వేతికారు.గతంలోను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాస్ట్లీ కార్ ల లో గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. గతంలోను డిసీయంలలో, లారీలలో గంజాయి రవాణా జరుపుతుండగా ఎక్సైజ్, పోలిసులుపట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన గాంజా వాలా గంజాయి రవాణాకుమీడియా ముసుగులో ( పేపర్ ట్రాన్స్ పోర్ట్ ) వాహనాలను వాడి సరిహద్దులు దాటించిన ఘనచరిత్ర ఉంది. ముందు వెనుక చెక్ పోస్టులను, పోలీసు పహరాలను కన్నుగప్పి తరలించడానికికాస్ట్లీ కారు, బైక్ లో రెక్కి నిర్వహిస్తు గంజాయి తరలిస్తారని రికార్డులుచెబుతున్నాయి. గంజాయి కేసులు నమోదవుతుంటే దందా తగ్గుముఖం పట్టిందనుకున్నారు అంతా.కానీ గంజాయి దందాలో పాత స్మగ్లర్లు ఎకంగా కుటుంబాలకు కుటుంబాలువినియోగి వస్తుండటంతో గంజాయి దందా మాత్రం అగడం లేదు. నిజామాబాద్ జిల్లా లో గంజాయిదందాలో మహిళలు పట్టు బడటం అందుకు నిదర్శనం. లక్షల్లో పెట్టుబడులు పెడుతున్న స్మగ్లర్లు…. గంజాయి ఒకప్పుడు ఒక సెక్షన్ వారికి అందుబాటులోఉండే మత్తు పదార్థం.  గంజాయి తాగితే వచ్చే కిక్కు కోసం కోందరు, గంజాయి ద్వార తయారయ్యో హ్యస్ అయిల్ కిక్కు కోసం వెర్రేక్కిపోతున్నారు.కానీ ఇప్పుడు గంజాయి దొరకని ప్రాంతం లేదు.. తాగాని సెక్షన్పీపుల్స్ లేరు. గంజాయి పై నిషేధం ఉంది.. ఉక్కుపాదంతో అనిచి వేస్తున్నామనియంత్రాంగాలు గోప్పలు చెబుతుండగా గంజాయి రవాణా, వినియోగం చాపకింద నీరులా నగరాలు,పట్టణాలు, మున్సిపాలిటీ, మండలాలు మొదలుకొని గ్రామాల్లో గంజాయి విచ్చల విడిగావినియోగిస్తున్నారు. దానితో గంజాయికి విపరీతమైన డిమాండ్ ఉంది. గంజాయి దందా లో ఓకప్పుడు, ఒక్కరిద్దరు ఫేమస్ స్మగ్లర్ల పేర్లు అందరికీ తెలుసు. కానీ నేడు గంజాయిఇక్కడ, అక్కడ అంటు ఎక్కడ దొరకని చోటు అంటు లేదు. బంగారం తో పోటీపడుతూ 100 గ్రాముల ప్యాకెట్లు వరకు విక్రయిస్తున్నారు.అందుకోసం గల్లి లో, ప్రతి సందుల్లో విక్రయాలు నిర్వహిస్తున్నారు. చిన్న చితక ఆవారా పనులు చేసే వారిని చేరదీసి గంజాయిదందా చేస్తున్నారు. ఇంకా గంజాయి చిన్న చితకగా అమ్మవారి కోసం పెద్ద ఎత్తున గంజాయిరవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. వారే లక్షల్లో పెట్టుబడులు పెట్టి కోట్లుసంపాదించే పనిలో పడ్డారు. ఆదివారం కామారెడ్డి లో దొరికిన మన్యం గంజాయి కోసం కనీసంరూ.20 లక్షల వరకు పెట్టుబడి గా పెట్టారంటే పెద్ద స్మగ్లర్ల పనే అని చెబుతున్నారు. గాంజావాలాల మన్యం నుంచి సరఫరా అవుతున్న గంజాయి దందా వెనుక ఉన్నారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో వేట మొదలు పెట్టింది పోలీస్, ఆబ్కారీ శాఖ…