Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 11:23 pm Posted by : ramakrishna

రెడ్ క్రాస్ ఎన్నికల్లో ఇందూర్ సేవా సమితి గెలుపు

 

. . .15 స్థానాల్లో 11 మంది సభ్యుల గెలుపు

. . . పాత కమిటీ లో నలుగురు గెలుపు

. .  . రేపు ఆఫీస్ బేరర్ ల ఎన్నిక 

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ రెడ్ క్రాస్ సోసైటీ మేనేజ్ మెంట్ సోసైటీ ఎన్నికల్లో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. సోసైటీ ఎన్నకల్లో 15 స్థానాల కోసం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఓటింగ్ జరిగింది. 15 స్థానాల కోసం పోలింగ్ జరుగగా 29 మంది పోటీ పడ్డారు. అందులో 9,826 మంది సభ్యులకు గాను 1522 మంది మాత్రమే ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మధ్యాహ్నం నుంచి ఓట్ల కౌంటింగ్ జరిగింది. అందులో ఇందూర్ సేవా సమితి ప్యానల్ నుంచి పోటీ చేసిన 15 మందిలో 11 మంది మెజారిటీ ఓట్లు సాధించారు. మొన్నటి వరకు ఉన్న పాత కమిటీ లోని బుస్సా ఆంజనేయులు ప్యానల్ లో14 మంది పోటీ చేయగా నలుగురు మాత్రమే మెజారిటీ ఓట్లు సాధించారు.

Indur Seva Samithi wins Red Cross elections
 

ఇందూర్ సేవా సమితి రెడ్ క్రాస్ సోసైటీ మేనేజ్మెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచింది. గత కమిటీ పై ఓటర్ లలో ఉన్న అసంతృప్తి ఓటింగ్ నుంచి, కౌంటింగ్ లో కనపడింది. గత కమిటీ పై వచ్చిన ఆరోపణలు, సభ్యత్వ నమోదు ఆరోపణలు పెద్ద దెబ్బ అని చెప్పాలి. అడిట్ నిర్వహించకపోవడం, సొసైటీ ఉద్యోగుల కోటరీ తో అక్రమాలు జరుపడం ప్రధాన కారణం అని చెప్పాలి. పాలక వర్గం పై కుల పెత్తనం కూడా మరో కారణం అని తెలిసింది. కేవలం బీసీ కార్డు తో సేవా ముసుగులో రాజకీయాలు చేసారు అని వాదనలు లేకపోలేదు. కేవలం ముగ్గురు నలుగురు ముదుర్లు తమ కు అడ్డా కోసమే రెడ్ క్రాస్ ను వాడు కున్నారు అనే ఆరోపణలు లేకపోలేదు. పేరు కులం కార్డు వాడిన నాయకులకు గతంలో కలెక్టర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే చర్చ జరిగింది.

Indur Seva Samithi wins Red Cross elections

నిజామాబాద్ రెడ్ క్రాస్ ఎన్నికల్లో జెన్ జీ కీలక పాత్ర పోషించింది. ముదుర్లను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న వారిని ఇంటికి సాగనంపింది. తమకి ఎదురు లేదనే బీరలు పలికిన లీడర్ లను ఎన్నికల ఫలితాలు తారుమారు చేసాయి. పాత కమిటీ స్థానం లో కొత్త కమిటీ కోసం పక్షం రోజుల క్రితం ఏర్పడిన కొత్త ప్యానల్ పాత కమిటీ ని ఎలాంటి అంచనాలు లేకుండా బరి లో నిలిచి మట్టి కరిపించింది. ప్రధానంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పాత కమిటీ ఓటమిని శాసించాయి. మునుపెన్నాడు లేని విధంగా కొత్త ప్యానల్ సంచలనంగా ఎన్నికల పోటీ లో నిలువడం పాత కమిటీ కి నచ్చలేదు. దానికి కులం కార్డు, బీసీ కార్డు, రాజకీయ రంగు పులిమినా ఓటర్లు మాత్రం పాత కమిటీ ని ఓడించారు. గెలిచినా వారు కేవలం కులం కార్డు, ఇతర కారణాలతో గట్టేక్కారని చెప్పాలి. గత మూడు దశబ్దలుగా కేవలం ఏకగ్రీవలకు అలవాటు పడిన పాత కమిటీ లకు ప్రత్యక్ష ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కొందరికి భవిష్యత్తు లేకుండా చేసాయి. సోమవారం నిజామాబాద్ రెడ్ క్రాస్ సోసైటీ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికలు మెజారిటీ ఓట్లు సాధించిన వారు ఎన్నుకొనున్నారు.