Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 3:02 pm Posted by : ramakrishna

శబరిమల అన్నదానానికి ఇందూర్ అయ్యప్పల సహకారం 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో  శబరిమలలో నిర్వహించే అన్నదానానికి సంబందించిన సామాగ్రి వాహనం నాందేవ్ వాడ ఛత్రపతి హనుమాన్  ఆలయం నుండి శబరికి బయలుదేరుతున్న వాహనాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో శబరిమల నిలకల్ ప్రాంతంలో జనవరి 7తేదీ నుండి 14తేదీ వరకు నిర్వహించే మహాఅన్నదాన కార్యక్రమానికి ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో 101 క్వింటాల బియ్యం, పప్పుదినుసులు, నూనె,మొత్తం దాదాపు 9 లక్షల విలువైన వంట సామాగ్రి వాహనాన్ని శబరికి పంపడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా శబరిమలకు విచేస్తున్న అయ్యప్పస్వాములకు సేవ చేసుకునే అవకాశం దొరకడం ఇందూర్ స్వాములకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు, అయ్యప్ప ఆశీర్వాదం దేశ ప్రజలందరి పైన ఉండాలని ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భారతదేశం ఉన్నత లక్ష్యాలను సాధించి ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేవిదంగా అయ్యప్ప ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆగమయ్య గురుస్వామి, గంగరత్నం గురుస్వామి, రవిస్వామి, పార్శి రాజు స్వామి, శ్రీనివాస్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Indur Ayyappa's contribution to Sabarimala food donation