Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 6:49 pm Posted by : ramakrishna

ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అందరికి ఆదర్శప్రాయం

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత తమ విలువైన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారందరికీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆదర్శప్రాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా రోడ్డులో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేసిన నవ చండీ యాగం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్, లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజు యాగంలో పాల్గొని యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సైతం ముందుకు వచ్చి లోక కళ్యాణార్థం నవ చండీయాగం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పలు రకాల పూజలతో పాటు యజ్ఞ హోమా చండీయాగ కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చిందన్నారు. సమాజంలో తమ పక్కనే ఇతరులు పడిపోయిన పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోతున్న నేటి కాలంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వారు గత కొన్నేళ్లుగా సుమారు 150 అనాధ మృతదేహాలకు అంతక్రియలు నిర్వహించడం అభినందనించదగ్గ విషయమన్నారు. కేవలం అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా ప్రతిరోజు బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉండే అనాధలకు అన్నదాన కార్యక్రమం కూడా ఈ స్వచ్చంద సేవ సంస్థ వారు నిర్వహించడం హర్షనీయమన్నారు. తదనంతరం ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ తమ స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ఇప్పటివరకు 150 అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించామని తెలిపారు. అందుకని వేద పురాణాల శాస్త్రాల ప్రకారం లోకకళ్యాణార్థం ఈ నవ చండీ యాగం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక అనాధ శవానికి అంతక్రియ నిర్వహిస్తే అశ్వమేధ యాగంగా పిలవబడుతుందని ఆయనన్నారు. ఈ యాగంలో సామూహిక కుంకుమార్చన, గణపతి గౌరీ పూజ, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

 

Indore Youth Voluntary Service Organization is a role model for all
Indore Youth Voluntary Service Organization is a role model for all
Indore Youth Voluntary Service Organization is a role model for all