Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:28 pm Posted by : ramakrishna

శ్రమైక దైవిక సౌందర్యానుభూతితో మొదలైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

 

. . . నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమలలో మొదలైన 12వ (పుష్కర) బ్రహ్మోత్సవాలు

 

. . . బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిన యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయం నిర్మాణం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలను ఆంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇందూరు తిరుమల ఆలయానికి స్వామివారు వేంచేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడవ సంవత్సరంలో అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య అన్నారు. ఆలయం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తయినాక స్వామివారి ప్రాభవం రెట్టింపుగా ఉంటుందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాలంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని, లోకకళ్యాణార్థం చేస్తున్న బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి అత్యంత ప్రీతికరమని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే అధిక పుణ్య ఫలమని అన్నారు. అదే విధంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత కనులపండుగగా జరగడం ఈ ప్రాంతానికి శుభిక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నర్సింహ రెడ్డి, విజయసింహారెడ్డి, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి,  సాయిలు, సాయి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.