Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 11:35 am Posted by : ramakrishna

సభ్యత్వ నమోదు లో ఇందూర్ పార్లమెంట్ రాష్ట్రంలో నెంబర్ వన్

 

. . . నిజామాబాద్ ఎంపీ అరవింద్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..

భారతీయ జనతా పార్టి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్  సెగ్మేంట్ టాప్ లో నిలిచిందని, మిగతా  పార్లమెంట్ నియోజకవర్గాల కంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందంజలో ఉండటం సంతోషంగా ఉందన్నారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ అర్బన్ పరిధిలోని దుబ్బ,  ఖలీల్ వాడి ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ మిగతా  పార్లమెంట్ నియోజకవర్గాల కంటే నిజామాబాద్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందంజలో ఉండటం సంతోషంగా ఉందని, దీనికి కృషిచేసిన ప్రతి బిజెపి నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి స్ఫూర్తితోనే  భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Indore Parliament is number one in the state in membership registration