బతుకమ్మ, బోధన్: బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాలలో ఇందుర్ హై స్కూల్ విద్యార్థులు విజయ డంక మోగించారు. ఇందూర్ మోడల్ పాఠశాల విద్యార్థిని డి.సంజన 588 రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు, ఎం. ఐశ్వర్య 582 మార్కులు, జె. సంజన 572 మార్కులు, కీర్తన 567 మార్కులు సాధించగా,550 పైగా 21 మంది విద్యార్థులు,500 లకు 120 మంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది. సబ్జెక్టుల వారీగా తెలంగాణలో 501 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పొందగా హిందీలో 100, ఇంగ్లీషులో 69, గణితంలో 53, సామాన్య శాస్త్రంలో 55, సాంఘిక

శాస్త్రంలో 75 విద్యార్థులు ఏ వన్ గ్రేట్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి టి.సంజన588 అత్యధిక మార్కులు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అంతేకాకుండా 550 పైగా ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సంపాదించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలిపారు.
