Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 2:09 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన గడ్డ ఇందూరు

  • ఇందూర్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఇందూర్ ఫుట్ బాల్ అకాడమీ వారు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు నిజామాబాదు జిల్లా అంటేనే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లని జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కి సిఫార్సు చేయడం జరిగిందని క్రీడాలను ప్రోత్సాహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటారన్నారు.

రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ, ఓలంపిక్స్ స్థాయిలో రానించి ఇందూర్ జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్, ఫుట్బాల్ అసోసియేషన్ సంజయ్, బీజేపీ నాయకులు ఆనంద్,పవన్ ముందడ, తదితరులు పాల్గొన్నారు.

Indore is the birthplace of international sportsmen