వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇందూర్ పసుపు రైతుల దశబ్దల చిరకాల కోరిక పసుపుబోర్డును పట్టువదలని విక్రమార్కుడిల ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించారన్నారు. ఎంపీగా గెలిపిస్తే...