Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 4:30 pm Posted by : ramakrishna

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇందూర్ పసుపు రైతుల దశబ్దల చిరకాల కోరిక  పసుపుబోర్డును పట్టువదలని విక్రమార్కుడిల ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించారన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేసాయని కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకి దక్కుతుంది అన్నారు. పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయని అన్నారు. ఇందూర్ కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూర్ వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. పసుపు బోర్డు ప్రకటించాక  కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేసాయని, ప్రతిపక్షాల కళ్ళు చేదిరిపోయేల  కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు,  రాజకీయ చాణిక్యులు పసుపుబోర్డ్ ఇందూర్ కి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29 ఆదివారం మన ఇందూర్ జిల్లా కేంద్రంలో  పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడటం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహా సమ్మేళన కార్యక్రమం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందూర్ జిల్లా ప్రజలందరు ముఖ్యంగా రైతు సంక్షేమన్ని కోరుకునే ప్రతి ఒక్కరు సభలో పెద్దఎత్తున పాల్గొన్ని  విజయవంతం చేయగలరని కోరారు.

Indore is set to become a hub for the agricultural sector.