సీతాయిపేట్ లో అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
ప్రారంభోత్సవాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్ లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు....