నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలి
బతుకమ్మ బాన్సువాడ : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఐదు విడతల్లో నిర్మించుకున్న విధంగా బిల్లులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు నార్ల సురేష్, ఎజాజ్, ఖాలెక్, అబ్దుల్ వాహబ్,తదితరులు పాల్గొన్నారు....