పేదవాడి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే పోచారం మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపుతున్నాయని పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు...