ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్   రామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలోపరిశీలించారు. పిల్లర్స్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని  లబ్ధిదారుకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఎక్కడ కూడా  ఇసుక. మొరం సమస్య లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతగా ఇండ్లను నిర్మించుకొని  త్వరగా గృహప్రవేశాలు చేయాలని అన్నారు....