ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించాలి

కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, లబ్ధిదారులు...