ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష   నిజామాబాద్, బతుకమ్మ : పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించి, పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల...