వికలాంగులకు, వృద్ధులకు నేరుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పిఆర్ డి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా అధ్యక్షులు గైని రాములు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ.. ఆగస్టు 11 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు రాకాసిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ హనుమాన్ ఫంక్షన్ హాల్ లో నిజామాబాద్ జిల్లా సదస్సు ఉంటుందని సూచించారు. ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శి...