Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:16 pm Posted by : ramakrishna

వికలాంగులకు, వృద్ధులకు నేరుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పిఆర్ డి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా అధ్యక్షులు గైని రాములు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ.. ఆగస్టు 11 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు రాకాసిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ హనుమాన్ ఫంక్షన్ హాల్ లో నిజామాబాద్ జిల్లా సదస్సు ఉంటుందని సూచించారు. ఈ సదస్సులో రాష్ట్ర  కార్యదర్శి అడివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బసవరాజ్ పాటిల్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్ బాబు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు, చట్టాలు, పథకాలు వైఫల్యం చెందాయని, వాటిని పరిష్కరించుకోవడానికి వితంతులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 300 పెన్షన్ ఇస్తుందని దాన్ని 5000 ఎక్కించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వికలాంగులకు 4016 రూ. దాన్ని 6016 రూపాయలకు పెంచాలన్నారు. వృద్ధులకు, వితంతులకు 2016 రూపాయల నుండి 4016 రూపాయలకు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని తెలియజేశారు. అలాగే అంతోదయ రేషన్ కార్డులను పాతవి కొనసాగిస్తూ కొత్తవి ఇవ్వాలని పేర్కొన్నారు.  వికలాంగులకు, వృద్ధులకు,  వితంతులకు ఇందిరమ్మ ఇండ్లను నేరుగా ఇవ్వాలన్నారు. రాజకీయ ఫైరవల్లి లేకుండా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలన్నారు. ఈ సదస్సుకు అందరు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జల్లాపురం. సాయిలు, గిర్ని రాజు, మంచిప్ప మోహన్, తబ్రీజ్, నెమలి సాయిలు, జూకంటి పావని, మంచిప్ప సునీత తదితరులు పాల్గొన్నారు.