ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ, ఎండి వీపీ గౌతమ్   కామారెడ్డి, బతుకమ్మ : లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  ఉచితంగా ఇసుక  సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే  లబ్ధిదారులకు చెల్లించేలా  చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ, ఎండి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తో కలిసి జిల్లాలోని భిక్కనూర్, దోమకొండ మండలాలలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి...