ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ

వెబ్ న్యూస్,బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ఉపాధికూలీల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈపథకాన్ని లబ్థిదారులకు వర్తింప జేసింది. ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను  ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది.మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది....