Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 1:25 pm Posted by : ramakrishna

ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ

వెబ్ న్యూస్,బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ఉపాధికూలీల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈపథకాన్ని లబ్థిదారులకు వర్తింప జేసింది. ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను  ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది.మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసింది. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈరెండు జిల్లాల్లో 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది.  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రానున్నాయి. ఒక సీజన్ లో రూ. 6000 చొప్పున ఉపాధి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.