వ్యవసాయానికి అనుకూలంగా ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనుల పంట భూములను లాభసాటి  వ్యవసాయానికి అనుకూలంగా  మలిచేందుకు  ఇందిరా సౌర గిరిజల  వికాసం పథకం ఎంతో తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇందిర సౌర గిరిజల వికాసం పథకం పై  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఈ పథకం ద్వారా జిల్లాలో గిరిజన పోడు పట్టాలు పొందిన...