ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో సోమవారం జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. విజయోత్సవ సంబరాల కోసం చేపడుతున్న చర్యల గురించి...