బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇంద్ర గాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాముడు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరమైన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల అశోక్, మోర్తాడ్ వీడీసీ అధ్యక్షులు జక్కం అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మైపాల్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జెడి చిన్న గంగారం, శ్రీధర్, నశీర్, మహమ్మద్ అహ్మద్, నాగభూషణం, జక్కం అశోక్, ప్రవీణ్, వద్యాట్ గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, కమ్మర్ పల్లీ నాయకులు గంగారెడ్డి, ప్రవీణ్, పెద్ద గంగారం, బాబు, రాజేశ్వర్, రమేష్, సతీష్, తేజ, రాజేందర్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.