- మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్
భీమ్ గల్, బతుకమ్మ : గతంలో ఏమర్జెన్సీ కాలాన్ని ఒక చీకటి అధ్యాయంగా పేర్కొంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొన్నా నియంత ధోరణి,నిర్ణయాల కారణలె అందుకు దారి తీశాయని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. గురువారం మండలంలోని పురానిపేట గ్రామ బీజేపీ శాఖ నిర్వహించిన రాజ్యాంగ హత్య దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జూన్ 25 1975 నుండి 21 మార్చి 1977 వరకు సుమారు 21 నెలలు ఈ ఎమర్జెన్సీ చీకటి రోజులు కొనసాగయని, దీంట్లో లక్ష పాతికవేల మంది జైలు పాలు కాగా పాత్రికేయులు 90 శాతం మంది ఆర్ఎస్ఎస్,ఏబీవీపీ,విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను జైల్లో పెట్టించారన్నారు. నేటికీ 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నేటి ప్రజానీకానికి నాటి కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేసిన ఘోరాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం కిసాన్ మోర్చా భీమ్ గల్ మండల అధ్యక్షులుగా పురానిపేట్ గ్రామానికి చెందిన తోట గంగాధర్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కిసాన్ మోర్చాను బలోపేతం చేస్తూ పార్టీని బలపరచడానికి ఈ నియామకం ఉపయోగపడాలని ఆయన అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య,ఓ బీ సీ జిల్లా ఉప అధ్యక్షులు లక్ష్మన్ గౌడ్, సీనియర్ నాయకులు సంధ్య రాజు, గంగాధర్ గౌడ్, హకీమ్ భాయ్, హరి కృష్ణ,రమేష్, ప్రేమ్ చంద్ చిన్న గంగాధర్,భూత్ అధ్యక్షులు,నాయకులు,పురాణిపేట్ గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
