Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 4:44 pm Posted by : ramakrishna

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నగరంలోని కాంగ్రెస్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పుల్లాంగ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశంలో అనేక మార్పులు తెచ్చి అభివృద్ధి వైపు వెళ్లే విధంగా చేసిందని అన్నారు.  ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లనే ఈరోజు దేశం ప్రపంచ దేశాల స్థాయిన అగ్రగామిగా నిలుస్తుంది అని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బ్యాంకులను జాతీయం చేయడం, హరిత విప్లవం, గరీబీ హటావో అని నినాదంతో ముందుకు వెళ్లిన నాయకురాలు అని తెలిపారు. పేదరికం నిర్మూలించాలని నెహ్రూ ఆశయం మేరకు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకువచ్చి పేదరికం నిర్మూలన చేసే దిశగా అడుగులు వేసిందని అన్నారు.  ఇందిరా గాంధీ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా సేవదళ్ అధ్యక్షులు సంతోష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, సకినాల శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రమోద్, శోభన్, అవిన్, మీనా, స్వప్న, రూపేష్ ముష్పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Indira Gandhi Jayanti celebrations in grand style