Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 2:45 pm Posted by : ramakrishna

రష్యా సైన్యంలో ఉద్యోగ ఆఫర్లపై భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

రష్యా సైన్యంలో చేరేందుకు వచ్చే ఉద్యోగ ఆఫర్ల విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, విశ్వసనీయత లేని వ్యక్తులు లేదా ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం రష్యా సాయుధ దళాల్లో చేరడం ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగించే ప్రమాదకరమైన మార్గమని, ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది. భారతీయ పౌరుల భద్రత, సంక్షేమం, సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని అన్నారు.