Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 6:20 pm Posted by : ramakrishna

ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

హైదరాబాద్, బతుకమ్మ : ఇరాన్-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతీయులను వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్‌ నుంచి 110 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అర్మేనియా నుంచి తొలి విమానం భారత్ చేరుకుంది. అయితే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భారతీయ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.