Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 5:16 pm Posted by : ramakrishna

నాణ్యమైన పెట్రోల్, డిజీల్ అందివ్వడమే ఇండియన్ ఆయిల్ లక్ష్యం

నిజామాబాద్ బతుకమ్మ సిటీ : వాహనాదారులకు ఎలాంటి కల్తీ లేని పెట్రోల్, డిజీల్ అందించడమే ఇండియన్ ఆయిల్ ప్రధాన ఉద్దేశ్యం అని సంస్థ నిజామాబాద్ డీలర్లు పేర్కొన్నారు. గురువారం నగరం లోని పూలాంగ్ సమీపంలో శ్రీడా ఫీలింగ్ స్టేషన్ ను డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ రోషన్ షావాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ రంగం లో ఇతర కంపెనీలతో పోటీ పడుతూ కొన్నేళ్లుగా వినియోగదారుల వద్ద నుండి నమ్మకమైన ఆయిల్ సంస్థగా ఇండియన్ ఆయిల్ ప్రజాధరణ పొందుతూ వస్తుందన్నారు. నాణ్యమైన పెట్రో, డిజీల్ అందిస్తూ ఇతర కంపెనీలతో పోల్చితే వాహనాలకు మైలేజ్ అధికంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు ఏరియా  సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్,   ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ రాహుల్, రిటైల్ సేల్స్ మేనేజర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Indian Oil's mission is to provide quality petrol and diesel