డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్, హెచ్.ఓ. డి డాక్టర్ ప్రసన్నా రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ జడ్జి, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ పద్మావతి ప్రత్యేక అతిథి గా హాజరై రాజ్యాంగ ఆవిష్యకత, ఉచిత న్యాయ చట్టం గురించి విద్యార్థుల కు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంను, రాజ్యాంగ సమీక్ష ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల కు రాజ్యాంగ ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఎలక్యూషన్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగజ్యోతి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు ప్రో. ప్రవీణ్ కుమార్, ప్రో.రామలింగం, ప్రో. నర్సయ్య, న్యాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.