Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 2:37 pm Posted by : ramakrishna

ఇంధనరంగంలో నంబర్ వన్ గా ఇండియా

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈవిషయాన్ని ’ఎక్స్‘ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచుకున్నారు. ఇంధనరంగంలో నంబర్ వన్ గా ఇండియా నిలుస్తోందన్నారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పెంచమన్నారు. స్థిరమైన, బాధ్యతయుతమైన మైనింగ్ ను కొనసాగించమన్నారు. కార్మికుల అవిశ్రాంత ప్రయత్నాలు, నిబద్ధత దీన్ని సాధ్యం చేశాయన్నారు. ఇందుకు కృషి చేసిన కార్మికుల అభినందనలు తెలిపారు. ఈమేరకు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.