వెబ్ డెస్క్, బతుకమ్మ : డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం పారిస్ ఏఐ సదస్సులో ఆయన పాల్గొని ప్రసగించారు. ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ’ఏఐ (కృత్రిమ మేధా) వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. సాంకేతికతో ఉద్యోగాలు పోతాయనేది వదంతే. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయి‘ అని అన్నారు.