Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 6:01 pm Posted by : ramakrishna

భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం

క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, బతుకమ్మ : భారతదేశం భిన్న మతాలు, కులాల సమూహమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చీలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను గౌరవించడం మానవత్వమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

India is a group of different religions and castes