ఎలాన్ మస్క్ శాట్ కామ్ సేవలకు భారత్ అనుమతి

ఢిల్లీ, బతుకమ్మ : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (శాట్‌కామ్‌) సేవల కంపెనీ స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలందించేందుకు భారత ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శాట్‌కామ్‌ లైసెన్సులో జాతీయ భద్రతకు కీలకమైన నిబంధనలకు లోబడేందుకు అంగీకరించడంతో స్టార్‌లింక్‌కు మన టెలికాం శాఖ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ టెక్నాలజీ ఆధారంగా అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలనందిస్తోంది.