Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 4:55 pm Posted by : ramakrishna

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ, బాన్సువాడ : 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం బాన్సువాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆటో నగర్ అసోసియేషన్ వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు.అనంతరం అధికారులతో, నాయకులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అశోక స్థూపాన్ని ఆవిష్కరించరు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ,బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి,ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Independence Day celebrations in full swing