ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ ఆవరణలో అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండా ఆవిష్కరించారు. ఇటీవల నిర్వహించిన జర్నలిస్టు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్, బిల్డర్స్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మంతం మధు బహుమతులు అందజేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు...