ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...