జుక్కల్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాల నుంచి ప్రారంభమైన పెరేడ్ ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ సంబంధిత కార్యాలయాల వరకు నిర్వహించారు. జుక్కల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జుక్కల్...