బాన్సువాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విట్టల్ రెడ్డి జాతీయ...