Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 9:31 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బాల్కొండ, బతకమ్మ: బాల్కొండ మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు నోట్ బుక్స్ అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఈ స్వేచ్చ స్వాతంత్ర్య భారతం గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో దేశ ప్రజలందరూ ఒక్కటై పోరాటం చేయడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించింది అన్నారు. అదే స్ఫూర్తి  తో ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రపంచంలో భారత దేశం ఇప్పుడు శక్తి వంతమైన దేశం అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధిలో  దేశంలో నెంబర్ గా ఉంది.  ప్రభుత్వాలు అధికారులు మనమందరం కలికట్టుగా రాష్ట్రం మరియు దేశాభివృద్ధి కి కార్యోన్ముఖులై కలిసి కట్టుగా పని చేయాలి అన్నారు.

Independence Day celebrations held at MLA camp office