బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ కమిటీ ప్రధాన కార్యదర్శి గంట చంద్ర శేఖర్, ఉపాధ్యక్షురాలు శ్యాం సుందర్, ప్రమోద్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
- ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ప్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, జర్నలిస్ట్లు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.