నిర్మల హృదయ పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నగరంలోని సుభాష్ నగర్ నిర్మల హృదయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ జండాను గైనకాలజిస్టు డా.అరుణా,నిర్మల హృదయ పాఠశాల కరస్పాండెంట్ డా.యు.నిర్మల ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన ఆటలపోటీలలో గెలుపొందిన విజేతలకు డా.అరుణా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.