నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాదులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి కళాశాలలోనూ, అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలోనూ జాతీయ పతకంను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, క్రమంగా అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందని, యువతే ఈ దేశ సంపద, భవిష్యత్తు అని అన్నారు. ఎన్.సి.సి. విద్యార్థుల వందన గౌరవంను అందుకున్నారు.ఈ వేడుకల్లో కళాశాల ఎన్.సి.సి. ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బాలమణి, కళాశాల అధ్యాపక బృందం, కార్యాలయ బృందం, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, వినయ్ కుమార్, అంబేద్కర్ అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త డా. రంజిత, పీఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, అడిషనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, రమేష్ గౌడ్, కిరణ్ కుమార్, వివేకానంద, లైబ్రేరియన్ పూర్ణచందర్రావు, ఎన్. ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్లు వెంకటరమణ, సుధాకర్,నరేష్ కుమార్, దస్తప్ప, రజిత, అనసూయ, గంగాధర్, వెంకటేష్ గౌడ్, మోబిన్, శ్రీకాంత్ సూపరిండెంట్ ఉదయభాస్కర్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
