Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 5:21 pm Posted by : ramakrishna

బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ, బోధన్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బోధన్ మున్సిపాలిటీకి చెందిన 14 మంది ఉద్యోగులు లకు  విశేష సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 మంది బూత్ స్థాయి అధికారులను, నియోజకవర్గంలో అర్హులైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో చేసిన కృషికి గాను సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ విటల్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.