Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 12:52 pm Posted by : ramakrishna

టీఎన్జీవో ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక

నిజామాబాద్,  బతుకమ్మ :  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయం ఆవరణలో ఎంప్లా యీస్ జేఏసీ జిల్లా చైర్మన్,  టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు  నాశెట్టి సుమన్ కుమార్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఉద్యోగులందరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, ప్రభుత్వ పథకాలను  ప్రజలకు అందించాలన్నారు.  రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని,  విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందజేయలన్నారు.   అనంతరం ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.