Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:58 pm Posted by : ramakrishna

ధర్నాచౌక్ లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు నిజామాబాద్ డిస్ట్రిక్ యూనిట్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ బల్ధియాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ జీవో 52ను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 1 నుంచి 5వ తేదిలోపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బల్ధియాలో పని చేస్తూ చనిపోయిన కార్మికుల  కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక వయస్సును 40 సంవత్సరాల నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో కార్పొరేషన్ అధికారులకు తమ డిమాండ్లపై వినతి పత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతోనే నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.